Manohar Reddy | ఓదెల, ఏప్రిల్ 6: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని నల్ల మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం వినతి పత్రాన్ని బండికి అందజేశారు. కొలనూరు స్టేషన్ పెద్దపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉండి ప్రజలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండనుందని మంత్రికి వివరించినట్లు తెలిపారు.
గత కొంతకాలంగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు నడిచే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తున్న విషయాన్ని మంత్రికి వివరించినట్లు తెలిపారు. స్థానికంగా పెద్దపల్లి ఎంపీ పట్టించుకోవడం లేకపోవడంతోనే మీ దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి రైలు హాల్టింగ్ చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు రాము, తొంటి హరీష్, కనుకుంట్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.