RAMAGUNDAM CPM | కోల్ సిటీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్ర వాదులు, మేధావులు, కుల రాజకీయ పార్టీలు యువత ముక్తకంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు. జమ్ము కాశ్మీర్లో పర్యటకులపై ఉగ్రవాదుల దాడితో కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని, దేశ సమైక్యత సమగ్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రాణా నష్టాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలని, మరణించిన వారి కుటుంబాలను రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు, మహేశ్వరి, గోదావరిఖని పట్టణ కమిటీ నాయకులు సారయ్య, నాగమణి, సాగర్, సంతోష్, కిషన్, నాయక్, రాధాకృష్ణ, రవి, సంతోష్, వెంకటస్వామి, ప్రశాంత్, నాగమణి, సమ్మక్క, రామలక్ష్మి, బండి లక్ష్మి, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.