Former MP Boinapalli | ప్రాణాలను హరిస్తున్న పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందును నిషేధించాలి : మాజీ ఎంపీ బోయినపల్లి డిమాండ్
Former MP Boinapalli | మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలి అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్వాట్ డిక్లోరైడ్ ( Paraquat Dichloride ) గడ్డి మందు వాడకుండా నిషేధం ( Ban ) విధించాలి అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapalli Vinod Kumar ) డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల సంఖ్యలో కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని అన్నారు. ఈ మందుకు విరుగుడు మందు లేకపోవడం వల్ల తాగిన వ్యక్తులు చనిపోతున్నారని పేర్కొన్నారు. పారాక్వాట్ డిక్లోరైడ్ వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రతి ఆరు నెలల పాటు నిషేధిస్తూ వస్తోందని, ప్రపంచంలో 70 దేశాలు ఈ గడ్డి మందును నిషేదించాయని వెల్లడించారు.
పారా క్విట్ డై క్లోరైడ్‌ను నిషేధించాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి, సీఎస్ రామకృష్ణారావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరామ్ రెడ్డి,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కిషన్‌కు లేఖ రాశారని వివరించారు.
పంట పొలాలకు వాడిన తరువాత గడ్డి మందును దాచుకోవద్దు : డాక్టర్ మహేష్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో పారా క్విట్ డై క్లోరైడ్ గడ్డి మందు తాగి ఎక్కువ మంది చనిపోతున్నారని
డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి వెల్లడించారు. ఈ గడ్డి మందు వాడకంపై గ్రామాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని, దీనిని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ఎండో సల్ఫన్ అనే మందును ఇండియాలో బ్యాన్ చేసినట్లుగానే పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందు త్రాగి బ్రతికేవాళ్లు సైతం సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోతున్నారని వివరించారు. పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందును వాడిన తర్వాత మిగిలిన మందును రైతులు దాచుకోవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

