Sanju Samson : భారత జట్టుకు ఆడాలంటే ప్రతిభకు కొదవ లేకున్నా.. అవకాశాల్ని ఉపయోగించుకోగల నేర్పు ఉండాలి. ద్వైపాక్షిక సిరీస్‌లో, ఐపీఎల్లో దంచేసే సంజూ శాంసన్ (Sanju Samson)కు ఈ మాట నూరు శాతం వర్తిస్తుంది. టీ20ల్లో మూడు సెంచరీలు బాదిన శాంసన్ వరల్డ్‌కప్‌లో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. సూపర్ 8లోనైనా అవకాశం రాకపోతుందా? అనే నమ్మకంతో సంజూ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు. అయినా సరే సూపర్ 8 తొలి మ్యాచ్‌లో సంజూను ఆడించడం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పష్టం చేశాడు. తుది జట్టు కూర్పుపై మాట్లాడిన సూర్య.. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ స్థానంలో సంజూను తీసుకోవడం లేదని తెలిపాడు.
ఓపెనర్‌గా ఎంపికైన ఈ పవర్ హిట్టర్ సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఘోరంగా విఫలమయ్యాడు. అభిషేక్ శర్మకు అస్వస్థత కారణంగా నమీబియాపై ఆడినా సున్నాకే ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసక ఆటతో.. మ్యాచ్ విన్నర్‌గా అవతరించి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అభిషేక్ మూడు డకౌట్లతో నిరాశపరిచిన వేళ.. సూపర్ 8లో శాంసన్‌కు చోటివ్వాలని.. టాపార్డర్‌లో ఒక రైట్‌హ్యాండ్ బ్యాటర్ ఉంటే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
🚨 SURYAKUMAR YADAV BREAK SILENCE ON SANJU SAMSON SELECTION 🚨
SuryaKumar Yadav:- “ So what you mean to say is that I should drop Abhishek and play in his place or drop Tilak Verma and play Sanju Samson at number 3 . Whatever is going on is fine ”
— Kiara (@crickiara) February 21, 2026
కానీ, అతడిని నమ్మి మరొకరిపై వేటు వేసేందుకు యాజమాన్యం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. శనివారం మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘సూపర్ 8 మ్యాచులోనైనా శాంసన్ జట్టులో ఉంటాడా?’ అని అడుగగా.. అంటే ‘అభిషేక్‌ను తప్పించాలా? లేదా తిలక్ వర్మ? స్థానంలో సంజూను మూడో స్థానంలో ఆడించాలా?’ అని ఎదురు ప్రశ్నించాడు.
📍 Ahmedabad
Super 8s prep in full swing 💪#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvSA pic.twitter.com/oFPuWD1vaN
— BCCI (@BCCI) February 21, 2026
అహ్మదాబాద్‌లో సఫారీలతో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్‌పై విలేకరుల ప్రశ్నలకు సూర్య తెలివిగా బదులిచ్చాడు. ‘లీగ్ దశలో ప్రస్తుతం టాపార్డర్ కాంబినేషన్ బాగా వర్కవుటైంది. సో.. మార్పులకు ఆస్కారం లేదు’ అని సూర్య కుండబద్ధలు కొట్టాడు. దాంతో.. సూపర్ 8లోనైనా తనకు అవకాశం లభిస్తుందని ఆశించిన శాంసన్‌కు, అతడి అభిమానులకు నిరాశే ఎదురవ్వనుంది. 2024 ఎడిషన్‌లోనూ బెంచ్‌కే పరిమితమైన కేరళ బ్యాటర్.. ఈసారి కూడా తుది జట్టులో చోటు ఆశించి భంగపడుతున్నాడు.
𝗚𝗿𝗼𝘂𝗽 𝗦𝘁𝗮𝗴𝗲: 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲𝗱! ✅
A look back at the top plays from #TeamIndia‘s campaign so far 🙌#T20WorldCup | #MenInBlue pic.twitter.com/vPgu38RSap
— BCCI (@BCCI) February 21, 2026
డిఫెండింగ్ ఛాంపియన్ జోరు చూపిస్తూ సూపర్ 8లో అడుగుపెట్టింది భారత్. ఓపెనర్ అభిషేక్ శర్మ మూడు డకౌట్లతో నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్ (నమీబియాపై 61, పాకిస్థాన్‌పై 77) మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (యూఎస్ఏపై 84 పరుగులు), శివం దూబే(నమీబియా, నెదర్లాండ్స్‌పై 66 పరుగులు), హార్దిక్ పాండ్యా(నమీబియాపై 52)లు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. బౌలింగ్ యూనిట్లో బుమ్రా.. వరుణ్ చక్రవర్తి( వికెట్లు) మాత్రమే వికెట్లతో చెలరేగుతున్నారు. సూపర్ 8 దాటాలంటే.. ఒకరిద్దరు రాణిస్తే సరిపోదు.. సమిష్టిగా ప్రత్యర్థిని దెబ్బకొట్టాల్సి ఉంటుంది.