Unanimous decision | మల్లాపూర్, అక్టోబర్ 17: మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం మండల బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఏకం కావాలని, తప్పనిసరిగా బీసీలకు 42 శాతం రిజరేషన్లకు కల్పించాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో తమ రిజర్వేషన్ల సాధన కోసం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడమాని స్పష్టం చేశారు. నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కు తాము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడంతో పాటు, మండల వ్యాప్తంగా బంద్ కు ప్రజలు సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. ఇక్కడ బీసీ సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.