Suicide attempt | హుజురాబాద్ రూరల్, నవంబర్ 3 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.
గమనించిన స్థానికులు 108 వాహనంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. బాధితునికి 20 గుంటల పొలం ఉండగా అప్పు సప్పు చేసి ఇటీవల ఇంటి పనులు మొదలు పెట్టుకున్నాడు. ఆ ఇల్లు డబ్బులు లేక సగంలోనే ఆగిపోయింది.
దీనికి తోడు పొలానికి సైతం అప్పు చేయడంతో అప్పులు మరింతగా పెరిగిపోయాయి. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని పలువురు అడగడంతో కలత చెందిన సదానందం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని భార్య రాధ, బంధువులు తెలిపారు.