ఓదెల, అక్టోబర్ 8 : దసరా పండుగ పోయి ఆరు రోజులు గడుస్తున్నా రైళ్లలో ప్రయాణికుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగకు ప్రాధాన్యత ఉండటంతో ఆ పండగకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దసరా, బతుకమ్మ పండుగకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ రైల్వే శాఖ మాత్రం ఇక్కడ ప్రత్యేక రైళ్లు వేయరని ప్రయాణికులు వాపోతున్నారు. ఇందుకు బుధవారం ఉదయం భాగ్యనగర్, మధ్యాహ్నం ఇంటర్సిటీ రైళ్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దసరా పండగ పోయి ఆరు రోజులు గడుస్తున్నా రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గడం లేదు. ఇంటర్సిటీ రైలు కొలనూరు స్టేషన్లో బుధవారం చాలామంది ప్రయాణికులు రైలు ఎక్కలేక ఇంటికి తిరుగు ముఖం పట్టడం కనిపించింది. బోగిలో ప్రయాణికుల రద్దీ కారణంగా ఊపిరి ఆడక ఇబ్బందులు పడ్డారు. పండుగ సందర్భంగా కనీసం రైళ్ల భోగిలను కూడా పెంచకపోవడానికి ప్రయాణికులు తీవ్రంగా ఖండించారు. అంతేకాక సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్యన నడిచే రైలు అన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైల్వే శాఖ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం నిరసిస్తున్నారు.