సారంగాపూర్, అక్టోబర్ 8: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తేలు రాజు అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో మండల పార్టీ నాయకులు బుధవారం పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమవేశమై ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపికై సమావేశాల్లో చర్చించారు.
గ్రామాల్లో పోటీ చేయడానికి ఆశక్తి ఉన్న నాయకుల వివరాలు తీసుకున్నారు. గ్రామానికి ఇద్దరు, ముగ్గురు అభ్యర్ధుల వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు తేలు రాజు మాట్లాడుతు స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రేస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి తమవంతు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఏ సమస్యలు వచ్చిన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేసిన వారి గెలుపుకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మెన్ సాగి సత్యం రావు, మండల పార్టీ ప్రదాన కార్యదర్శి అనంతుల గంగరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు బైరి మల్లేష్ యాదవ్, ఓడ్నాల లావణ్య జగన్, భుక్య సంతోష్ నాయక్, పల్లపు వెంకటేష్, సాంబారి గంగాధర్, అనుపురం శ్రీనివాస్, రమేష్, మహేష్, రాయమల్లు, సాగర్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.