చుంచుపల్లి, అక్టోబర్ 08 : చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీబీ అలర్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుధవారం క్షయ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు హెచ్ఇఓ పున్నమయ్య , పద్మకుమార్, సుష్మ మాట్లాడుతూ బలహీనంగా ఉన్నవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, వయసు పైబడిన వారికి, తాగుడు, గుట్కాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడినవారికి ముందు జాగ్రత్తగా ఊపిరితిత్తుల ఎక్స్ రేలు తీయడం జరిగిందని తెలిపారు.
దానిలో నార్మల్, అబ్ నార్మల్ రిపోర్టును బట్టి జిల్లా ఆస్పత్రికి రిఫరెన్స్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈఓ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు వాసిరెడ్డి మురళి, ఏపూరి శ్రీనివాస్, వాడపల్లి జకరయ్య, పంచాయితీ గుమస్తా రామకృష్ణ, ఏఎన్ఎం భాగ్య, ఆశా కార్యకర్తలు జయమ్మ, అలివేలు, ఎక్స్ రే కో ఆర్డినేటర్ బట్టు వెంకటేశ్వర్లు, టీబీ, హెచ్ఐవీ సూపర్వైజర్, పంచాయితీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Chunchupalli : విద్యానగర్ కాలనీలో క్షయ పరీక్షలు