Jagityal | పెగడపల్లి: భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జగిత్యాల అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. పెగడపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను బుధవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనందకుమార్, డీటీ లాస్యశ్రీ, ఆర్ఐలు శ్రీనివాస్, జమున, సీనియర్ అసిస్టెంట్ అంజనేయులు, జీపీవోలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.