Chief Justice of India | కోరుట్ల, అక్టోబర్ 8: సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గావాయి పైన దాడి చేసిన లాయర్ ను ఉరితీయాలని పట్టణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కుల వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతటి పెద్ద హోదాలో ఉన్న దళిత ఉన్నంత వ్యక్తులకు ఎక్కడో ప్రాంతంలో అవమానం జరుగుతుందని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరగడం దేశంలో జరుగుతున్న పరిణామాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోని మనువాదులు దళితులను అనుగదొక్కాలనే కోణంలోని ఆలోచిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఇతర రంగాలలో ఉన్న వారిని అవమానించడం కొనసాగుతున్నాదని పేర్కొన్నారు. దళితులను అవమానిస్తే యావజ్జివ కారాగారా శిక్షణ, ఉరిశిక్ష అమలయ్యే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఉయ్యాల శోభన్, పసుల కృష్ణ ప్రసాద్, ఇంద్రాల హరీష్, పొట్ట లక్ష్మణ్, సామల దశరథం, గురు మంతుల సత్తయ్య, సామల వేణుగోపాల్, కండ్లే మైకల్, మైస అనంతరావు, చిట్యాల లచ్చయ్య, దామ శ్రావణ్, మైస నవీన్, కల్లూరి దేవయ్య, ఐలాపూర్ లక్ష్మణ్, దామ ఆనంద్, గంగాధర్, చింటూ తదితరులు పాల్గొన్నారు.