Kiran Abbavaram | ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ నటుడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ త్వరలోనే K-RAMP సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కిరణ్ అబ్బవరం టీం. అయితే ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
నాన్ తెలుగు హీరోల సినిమాలు తరచూ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదలవుతుంటాయి. కానీ తెలుగు యాక్టర్లు మాత్రం ఇతర ప్రాంతాల్లో సినిమాలు విడుదల చేసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నాడు. గతేడాది దీపావళికి రిలీజైన చిత్రం KA. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తమిళనాడులో (డబ్బింగ్ వెర్షన్)మాత్రం విడుదల కాలేదు. దీంతో అంతా షాకయ్యారు. తమిళనాడులో విడుదల చేయాలని చాలా ప్రయత్నించామన్న కిరణ్ అబ్బవరం ఆ టైంలో పడ్డ ఇబ్బంది గురించి షేర్ చేసుకున్నాడు.
కఠినమైన వాస్తవం ఏమిటంటే మాకు తమిళనాడులో స్క్రీన్లు దొరకవని చెప్పారు. మొదటి వారం ముగిసే వరకు అసలు తెలుగు వెర్షన్‌కు కూడా సరైన స్క్రీన్లు దొరకలేదు. ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ మాకు 10 స్క్రీన్లు మాత్రమే దొరికాయన్నాడు కిరణ్ అబ్బవరం.
ఇతర రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు ఇవ్వరు..
కొందరు లాజిస్టిక్స్ అంటారు. మరికొందరేమో స్టార్డమ్ అంటారు. కానీ నాకు అర్థం కాలేదు. ఇతర ఇండస్ట్రీ నుండి యంగ్ యాక్టర్స్ మంచి సినిమాలు చేసినప్పుడు తెలుగు ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు. రీసెంట్గా మలయాళం నుండి తెలుగుకు డబ్ చేసిన లోక చాప్టర్ హౌస్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అయింది. కానీ తెలుగు నుంచి యంగ్ యాక్టర్స్ ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు మాత్రం ఇతర రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు ఇవ్వరంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా ఈ దీపావళికి తెలుగులో విడుదలవుతోంది. ఎక్కువ స్క్రీన్లు దొరికాయి. తమిళనాడులో తెలుగు సినిమాకి ఉన్నంత ప్రేమ నాకు లభించదు. ప్రదీప్ రంగనాథన్ లా నాకు తమిళనాడులో థియేటర్లు దొరకవు. మేము తమిళ స్టార్లను ప్రేమిస్తాం.. వారి సినిమాలకు సపోర్ట్ ఇస్తాం.. దానికి ప్రతిఫలంగా మేము అదే ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్