వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు
- బైక్, లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు..
- రైలు నుంచి జారిపడి మరొకరి మృతి
హుజూరాబాద్‌టౌన్/ జమ్మికుంట రూరల్ జనవరి 13: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని పరకాల క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మరణించగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ రైల్వే గేట్ సమీపంలో రైలునుంచి జారిపడి మరో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎలతుర్తి మండలం వీరనారాయణపూర్కు చెం దిన మండ సాయి(20), చదిరం ఆదిత్య(22) రాత్రి 11 గంటలకు బైక్‌పై హుజూరాబాద్ నుంచి వీరనారాయణపూర్కు వెళ్తున్నారు. పరకాల క్రాస్‌రోడ్డు వద్ద వీరి వాహనాన్ని ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ సాయిని స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
తీవ్రంగా గాయపడ్డ ఆదిత్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. స మాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసులు మొండయ్య, మొగిలి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ రైల్వే గేట్ సమీపంలో రైలు బండి నుంచి జారిపడి ఒకరు మృతి చెందినట్లు రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి శుక్రవారం తెలిపారు. మృ తుడు జయశంకర్ భూ పాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లికి చెందిన పోలోజు ర మేశ్(25)గా గుర్తించామని పేర్కొన్నారు. మృతు డి తల్లి కవిత తన కొడుకుకు మూడేండ్లుగా ఓ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అమ్మాయి వేధింపులే తన కొడుకు మృతికి కారణమని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.
రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి గాయాలు
శంకరపట్నం, జనవరి 13: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం వద్ద శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంకాయగూడెంకు చెందిన పొన్నం ఎల్లయ్య మనుమడు సుశాంత్‌తో కలిసి వ్యవసాయ పొలం వద్ద పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. వేలేరు మండలం కమ్మర్పేట్ తండాకు చెందిన వంశీనాయక్, లౌడియా బైక్‌పై హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తూ తన ఇంటి వద్ద హైవే క్రాస్ చేస్తుండగా ఎల్లయ్య బైక్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎల్లయ్య, సుశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ‘108’ లో ఇద్దరిని కరీంనగర్ దవాఖానకు తరలించారు. పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. రెండు బైక్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

