దళిత బంధు పథకం ప్రారంభించి నేటితో రెండేండ్లు పూర్తయింది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో 2021 ఆగస్టు 16న ఆయనే స్వయంగా ప్రారంభించారు. హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం వల్ల ఇక్కడి దళితుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ, వాహనాలు నడుపుకుంటూ, పారిశ్రామికులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు ఇంకొకరిపై ఆధారపడి బతికిన దళితులు ఇప్పుడు ఇంకొకరికి ఉపాధి చూపే స్థాయికి చేరుకున్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గానికి వంద చొప్పున, ఆ తర్వాత 1,100 చొప్పున మంజూరు చేయగా, ఇప్పుడు క్రమంగా అన్ని నియోజకవర్గాలకు దళిత బంధు విస్తరిస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : దళితబంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల జీవితాను సమూలంగా మార్చివేసింది. తరతరాలుగా కూలీలుగా మగ్గుతూ వచ్చి న వీరి జీవితాలు సీఎం కేసీఆర్ ఆశయ స్ఫూర్తితో ఒక్కసారిగా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ల క్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబా ద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లా అధికారులు నిరంతరాయంగా శ్రమించి 2022 డిసెంబర్ 13 వరకు నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి దళితుడికి లబ్ధిని చేకూర్చారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో 2,116, హుజూరాబాద్ రూరల్‌లో 2,720, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 1,623, జమ్మికుంటరూరల్లో 2,358, జమ్మికుంట మున్సిపాలిటీలో 2,264, వీణవంకలో 3,009 యూనిట్ల చొప్పున 14,090 మందికి, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలంలో 3,931 మందికి కలిపి నియోజకవర్గంలో మొత్తం 18,021 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు.
యూనిట్ల ఎంపికలో స్వేచ్ఛ
తమ కోసం ఇలాంటి ఒక పథకం అమలులోకి వస్తుందని దళితులు కలలో కూడా ఊహించ లేదు. రూ.లక్ష రుణం కావాలంటే సవాలక్ష ప్రశ్న లు సంధించి, ఆస్తులు తనఖా పెడితే గానీ, బ్యాం కుల్లో రూపాయి దొరకని పరిస్థితులు ఉండేవి. బ్యాంకుల చుట్టూ తిరగలేక తమ బతుకులేవో తా ము బతుకుతున్న ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సహా యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వ చ్చింది. ఈ పరిణామాలు మొదట దళితులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన స్వయం సహాయక యూనిట్ల కింద రుణం అంటేనే అనేక ఆంక్షలు, నిబంధనలు ఎదురయ్యేవి. ఈ పథకంలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లబ్ధిదారులు తమకున్న సామర్థ్యాన్ని బట్టి యూనిట్లను ఎంచుకున్నారు. ఈ విధానాన్ని బట్టి యూనిట్లను అధికారులు 6 సెక్టార్లుగా విభజించారు. లబ్ధిదారులు 95 రకాల వ్యాపార కార్యకలాపాలను ఎంచుకున్నారు. కొందరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో యూనిట్‌ను ఎంచుకున్నారు.
ఇలా చూస్తే వ్యవసాయ అనుబంధ సెక్టార్లో 3,531 మంది లబ్ధిదారులు కలిసి 2,827 యూ నిట్లు ఎంచుకున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 172 మంది కలిసి 164 యూనిట్లను ఎంచుకున్నారు. ఇందులో 8 మంది గ్రూపులుగా ఏర్పడి ఒక్కో యూనిట్‌ను ఎంపిక చేసుకున్నారు. రిటైల్ సెక్టార్లో 3,205 మంది కలిసి 2,708 యూనిట్లను ఎంచుకున్నారు. ఇందులో 497 మంది గ్రూపులుగా ఏర్పడి యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. సర్వీస్ అండ్ సప్లయ్స్ సెక్టార్లో 2,729 మంది 2,708 యూనిట్లను ఎంచుకున్నారు. ఇందులో 21 యూనిట్లను గ్రూపులుగా ఏర్పడి ఎంపిక చేసుకున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో 5,853 మంది 5,134 యూనిట్లను ఎంచుకున్నారు. ఇందులో 719 యూనిట్లను గ్రూపులుగా ఏర్పడి ఎంపిక చేసుకున్నారు. మొత్తంగా చూస్తే 18,021 దళిత కుటుంబాలు 16,149 యూనిట్లను ఎంచుకుని తమ కాళ్లపై తాము నిలబడి ఇపు డు ఆర్థికంగా సంపాదించుకుంటున్నారు. ఇందు కు ఒక్కో కుటుంబానికి రూ.9.90 లక్షల చొప్పున మొత్తం రూ.1,784.79 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఒక్కో లబ్ధిదారుని పేరిట రూ.10 వేలు నిలుపుకుని, ప్రభుత్వ మరో రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధిని జమ చేసింది.
పారదర్శకంగా అమలు
దళిత బంధు పథకం పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం ‘దళిత బంధు’ యాప్ రూపొందించింది. ప్రతి లబ్ధిదారుల వివరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. వీటిని సంబంధిత క్లస్టర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. యూనిట్‌ను స్థాపించిన లొకేషన్‌కు వెళ్లి సదరు యూనిట్ స్థితి గతులను, లబ్ధిదారుడి ఫొటో తీసి ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో వ్యాపారం ద్వారా దినసరిగా సంపాదిస్తున్న వివరాలన్నింటినీ నమోదు చేస్తున్నారు. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పథకం అమలు తీరును పరిశీలించిన నీతి అయోగ్లాంటి సంస్థలు కూడా ప్రశంసించాయి. 2022 సెప్టెంబర్ 2న జిల్లా పర్యటనకు వచ్చిన విశ్వనాథ్ బిష్ణోయ్ నేతృత్వంలోని నీతి అయోగ్ బృందం హుజూరాబాద్‌లోని పలు దళిత బంధు యూనిట్లను సందర్శించింది. లబ్ధిదారులు యూనిట్లను వినియోగించుకుంటున్న తీరు, ఉపాధి పొందుతు న్న తీరును చూసి ఇంత మంచి పథకం దేశంలో ఎక్కడా లేదని బృంద సభ్యులు ప్రశంసించారు.
దళితుల జీవితాల్లో మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ చేయూతను ఆసరా చేసుకున్న దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నాయి. వివిధ రంగాల్లో ఆయా యజమానుల కింద పనిచేసి కూలీలుగా ఉన్న దళితులు ఇప్పుడు వారే ఆర్థికంగా బలపడడమే కాకుండా మరో పది మందికి ఉపాధి చూపే పరిస్థితికి చేరుకున్నారు. రెండేళ్లలో వారి జీవితాల్లో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మామూలు పాఠశాలల్లో చదువుకునే తమ పిల్లలను ఇప్పుడు కాన్వెంట్లు, కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కుటుంబాలు గడవక అప్పుల పాలైన ఎందరో ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అప్పులు చెల్లించుకుంటున్నారు. వ్యాపారాల్లో స్థిర పడుతున్న కొందరు ఆస్తులు సమకూర్చుకుంటున్నారు. మెరుగైన జీవితం గడుపుతున్నారు. గతంలో అప్పులపాలైన దళితులు ఇప్పుడు మరొకరికి అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చారు. ఇదంతా కేసీఆర్ చలవేనని, దళిత బంధు పుణ్యమేనని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు.
నియోజకవర్గానికి 1,100 యూనిట్లు
హుజూరాబాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం చేసింది. అందులో భాగంగా ఇది వరకే ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున మంజూరు చేశారు. అందులో భాగంగా హుజూరాబాద్ కాకుండా జిల్లా పరిధిలోని కరీంనగర్‌కు 100, మానకొండూర్‌కు 61, చొప్పదండికి 49 యూనిట్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా, ప్రతి నియోజకవర్గానికి 1,100 యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దళిత యువకులు దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించనున్నారు.
డ్రైవర్ నుంచి ఓనరైండు..
వీణవంకలో ట్రాక్టర్ నడుపుతున్న దాసారపు కొమురయ్య
ఈ చిత్రంలో ట్రాక్టర్ నడుపుతున్న ఇతని పేరు దాసారపు కొమురయ్య. ఊరు వీణవం క. ఇంటర్ దాకా చదివాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు మానేసి తన 19వ ఏటనే లారీ క్లీనర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబానికి దూరం గా ఉంటూ, సరిగ్గా తిండిదొరక్క ఎన్నో కష్టాలు పడ్డాడు. చాలీచాలని జీతంతో దుర్భర జీవి తం గడిపాడు. డ్రైవర్‌గా పని చేస్తే ఎక్కువ జీ తం వస్తుందని లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కొన్ని రోజులు లారీ నడిపాడు. తర్వాత రా మడుగులో గ్యాస్ గోదాం డ్రైవర్‌గా, తర్వాత ఊళ్లోనే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేయసాగాడు. ఇలా డ్రైవర్ కొమురయ్యగా పేరు పొందాడు. ఎంత పనిచేసినా భార్య, ముగ్గురు పిల్లలను చూసుకోవడమే కష్టంగా మారింది. సొంతం గా బండి కొనుక్కోవాలని అనుకున్నా అంత ఆర్థిక స్థోమత లేక ఆశ చంపుకున్నాడు. ఇదే టైంలో సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు కొమురయ్యకు వరంలా మారింది. పథకం కింద ట్రాక్టర్ యూనిట్‌కు దరఖాస్తు చేసుకు న్నాడు. అధికారులు కొనివ్వగా, దొరికిన పని చేసుకుంటూ మొరం, ఇసుక, ధాన్యం జారగొట్టడం, వరినాట్ల సీజన్లో పొలాలు దున్నడం వంటి పనులు చేసుకుంటున్నాడు. మొన్నటి దాకా ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేసిన కొముర య్య ఇప్పుడు ట్రాక్టర్‌కు ఓనరై దర్జాగా బతుకుతున్నాడు. ‘బతుకుదెరువు కోసం 20 ఏం డ్లు డ్రైవర్ జీవితం గడిపిన. జీతం సరిపోక అ ప్పులు చేసిన. నా బతుకు గింతే..? సచ్చేదాక జీతానికి పని జేయ్యాల్సిందేనని ఎన్నో సార్ల బాధపడ్డ. కానీ కేసీఆర్ తెచ్చిన దళితబంధుతో నా జీవితం మారింది.నా బతుకంతా కష్టపడ్డా ట్రాక్టర్ కొనకపోదు. ఖర్చులు పోను నెలకు రూ.20వేలు మిగులుతున్నయి. పైసలు బ్యాం కుల వేసుకుంటన్న’ అని కొమురయ్య సంతోషంగా చెబుతున్నడు.
– వీణవంక, ఆగస్టు 15
సమ్మయ్య కుటుంబం తేరుకున్నది
గాయత్రీ ఫ్యాబ్రిక్స్ షాప్‌లో తలగంప రాజు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు తలగంప రాజు. ఊరు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం. వీళ్లది పేదకుటుంబం. తల్లిదండ్రులు వనజ-సమ్మయ్య కూలీ పనిచేస్తేనే ఇల్లుగడుస్తుంది. కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉన్నా పంట రాక ఇబ్బందులు పడుతుండేవారు.కొన్నేళ్ల కింద సమ్మయ్య ఆరోగ్యం దెబ్బతిన్నది. చికిత్స కోసం రూ.5లక్షల అప్పు లు చేశారు. తల్లి వనిత ఒక్కతే కూలీ పనిచేసుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించింది. రాజు పీజీ, చిన్న కొడుకు శశి డిగ్రీ చేయగా, తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పిల్లలిద్దరూ ఎలా సెటిల్ అవుతారో..? అని తల్లిదండ్రులు బెంగపెట్టుకునేవారు. కూలీలుగానే బతుకుతారా..? అని దిగులు పడ్డారు. ఇదే టైంలో సీ ఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు వీళ్లకు వెలుగు రేఖగా నిలిచింది. వనజ లబ్ధిదారుగా ఎంపికైంది. పద్నాలుగు నెలల క్రితం జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ ఏరియాలో గాయత్రి ఫ్యాబ్రిక్స్ ఏర్పాటు చేసుకోగా, బాగా నడుస్తున్నది. రాజు షాపును చూసుకుంటున్నాడు. ఫ్యాబ్రిక్స్ ఒక్కటే కాకుండా మరో పోర్షన్‌కు కిరాయికి తీసుకుని డిజైన్ బోటిక్‌ను ఏర్పాటు చేశాడు. తన రూంల కిరాయి పోను, నెలకు రూ.30వేలకు పైగా సంపాదిస్తున్నాడు. తండ్రి సమ్మయ్యకు మెరుగైన చికిత్స చేయించాడు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి బయట పడ్డాడు. తల్లిదండ్రులను కూలీకి బంద్ చేయించాడు. తమ్ముడిని ఉన్నత చదువులకు ప్రిపేర్ చేయిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులను 70శాతం తీర్చాడు. దళిత బంధుతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ‘దళిత బంధు రాకముందు బాగా ఇబ్బంది పడ్డమని, ఇప్పుడు ఏ బాధాలేదని, నాన్న వైద్యం చేయించి ఆరోగ్యం బాగు చేయించినమని రాజు సంతోషంగా చెబుతున్నడు.
-జమ్మికుంట, ఆగస్టు 15
తిరుపతి దశ మారింది..
ఇతని పేరు మారముళ్ల తిరుపతి. ఊరు వీణవంక మండలం వల్భాపూర్. నిరుపేద కుటుం బం. తల్లి కూలీ, తండ్రి మేస్త్రీ పనిచేసేవారు. కష్టపడి తిరుపతి ఎంఏ, బీఈడీ చదివాడు. చదువుకుంటూనే పలు ప్రైవేట్ స్కూళ్లలో విద్యాబోధన చేసేవాడు. నెలకు రూ.2వేల జీతం వచ్చేది. అలా రూ.6వేల వేతనం వరకు వెళ్లాడు. తిరుపతికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. కొద్దో, గొప్పో జీతం పెరిగినా, కుటుంబ పోషణ భారంగా ఉండేది. అలా సాగుతున్న తిరుపతి జీవితంలోకి దళిత బంధు వ చ్చింది. జమ్మికుంట-వీణవంక ప్రధాన రోడ్డులో భాగ్యలక్ష్మీ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం మానేసాడు. షాప్ బాగా నడుస్తోంది. ఓ గుమస్తాను పెట్టుకున్నాడు. అతడికి నెలకు రూ.4వేల వేతనం ఇస్తున్నాడు. అక్కడితో ఆగకుండా సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు ఫుడ్ ప్రొవిజన్ కాంట్రాక్ట్‌ను పొందాడు. నెలకు రూ.2లక్షల విలువైన సరుకులు పంపిస్తున్నడు. నాణ్యమైన సరుకుల సరఫరాతో అధికారులు మరో యేడాది తిరుపతికే కాంట్రాక్టు ఇచ్చారు. ఖర్చులన్నీ పోనూ నెలకు రూ.30వేల ఆర్జిస్తున్నాడు.
– జమ్మికుంట, ఆగస్టు 15