లండన్: ఐపీఎల్‌తో పాటు తమకు జట్లు ఉన్న లీగ్‌ల్లో పాకిస్థాన్ క్రికెటర్లకు ‘నో’ చెబుతున్న భారత ఫ్రాంచైజీలు.. యూకేలో జరిగే ‘ది హండ్రెడ్’లోనూ అదే విధానాన్ని అవలంభించనున్నాయి. మార్చి 12న లండన్‌లో జరుగబోయే 2026 వేలానికి మొత్తం 711 మంది క్రికెటర్లు రిజిష్టర్ చేయించుకోగా అందులో పాకిస్థాన్ నుంచి 63 మంది ఉన్నారు. కాగా హండ్రెడ్‌లోనూ ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఎంఐ లండన్ (రిలయన్స్), మాంచెస్టర్ స్పోర్ట్స్ జెయింట్స్ (ఆర్పీఎస్జీ గ్రూప్), సౌథర్న్ బ్రేవ్ (జీఎంఆర్ గ్రూప్), సన్‌రైజర్స్ లీడ్స్ (సన్ టీవీ).. వేలంలో పాకిస్థాన్ ఆటగాళ్ల కోసం బిడ్ వేయడం లేదని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికాలో జరిగే ఎస్ఏ 20తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (అమెరికాలో), ఐఎల్ టీ20 (దుబాయ్)ల్లోనూ భారత ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను పట్టించుకోలేదు.