చెన్నై: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ తలరాతను మార్చిన జొనాథన్ ట్రాట్.. ఆ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలకు వీడ్కోలు పలికాడు. 2022లో ప్రధాన కోచ్‌గా నియమితుడైన ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్లో అగ్రశ్రేణి జట్లకు సైతం సవాల్ విసిరే స్థితిలో ఆఫ్ఘాన్‌ను నిలిపాడు. జట్టులో యువ, నైపుణ్యవంతులైన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టు ఎదుగుదలకు ఎంతగానో కృషి చేశాడు. మూడున్నరేండ్ల కాలంలో ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ప్రధాన టోర్నీల్లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించి తాము ఎంతమాత్రమూ పసికూనలం కాదని నిరూపించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు స్ఫూర్తిధాయక ప్రదర్శన, 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరడం ట్రాట్ కోచింగ్ ఫలితమే అని చెప్పకతప్పదు. తాజా ప్రపంచకప్‌తో ఆయన ఒప్పందం ముగియగా గురువారం కెనడాతో మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.