Modi Cabinet | ఎనిమిదేళ్లలో ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా.. నిరసనల సెగతోనే వైదొలిగిన అక్బర్, ప్రధాన్..!
Modi Cabinet : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థిలోకం నిరసనల ధాటికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. గత ఎనిమిదేళ్లలో ఇలా పదవీకాలం మధ్యలోనే వైదొలిగిన ఏకైక కేంద్ర మంత్రి ప్రధానే కావడం విశేషం
Modi Cabinet : నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థిలోకం నిరసనల ధాటికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేశారు. జంతర్ మంతర్ కేంద్రంగా దాదాపు నెల రోజుల పాటు అలుపెరగని పోరాటానికి.. యువతరం మొండిపట్టుదలకు ఎట్టకేలకు దిగొచ్చిన ప్రధాన్ శనివారం రిజైన్ చేశారు. గత ఎనిమిదేళ్లలో ఇలా పదవీకాలం మధ్యలోనే వైదొలిగిన ఏకైక కేంద్ర మంత్రి ప్రధానే కావడం విశేషం. 2018లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ (MJ Akbar) అనూహ్యంగా రాజీనామా సమర్పించారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థిలోకం శాంతించింది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాన్ స్వచ్ఛందంగా వైదొలగడంతో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఉద్యమాన్ని విరమించారు. అయితే.. గత ఎనిమిదేళ్లలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. అయన కంటే ముందు.. 2018లో అనూహ్య పరిణామాల మధ్య ఎంజే అక్బర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
లైంగిక వేధింపుల ఆరోపణలతో
నరేంద్ర మోడీ క్యాబినెట్లో మంత్రిగా 2016లో బాధ్యతలు చేపట్టిన అక్బర్.. అంతుకుముందు వార్త పత్రిక ఎడిటర్గా ఉన్న సమయంలో పలు మహిళలపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఆయనకు వ్యతిరేకంగా మీటూ ఉద్యమం తీవ్రమవ్వడంతో అక్బర్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
Dharmendra Pradhan First Minister To Quit Because Of A Row Since MJ Akbar In 2018https://t.co/cs7a43DWga pic.twitter.com/5jrVX95LaB
— NDTV (@ndtv) July 25, 2026
ఈసారి నీట్ ప్రశ్నాప్రత్రం లీకేజీపై విద్యార్థులు భగ్గుమనడంతో.. ప్రధాన్ రాజీనామా అనివార్యమైంది. అయితే.. 2017లో రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాది యూపీఏ ప్రభుత్వం కాదు మంత్రులు రాజీనామా చేయడానికి అని నవ్వుతూ జవాబిచ్చాడు. కట్ చేస్తే తొమ్మిదేళ్లకు ఎన్డేఏ మంత్రివర్గంలోని ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య పరిణామాలతో వైదొలగాల్సి వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

