బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీనగర్లో ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు శుక్రవారం తొలగించారు. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403పీలో ఎన్బీటీనగర్ కమాన్ లోపల ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 1200 గజాల స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు బ్లూషీట్లు వేశారు.
ఈ స్థలంలో చాలా భాగం ప్రభుత్వానిదే అంటూ స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘రూ.40కోట్ల స్థలంపై వివాదం’ పేరుతో నమస్తే తెలంగాణ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. స్పందించిన అధికారులు సుమారు 300 గజాల మేర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. ప్రభుత్వ స్థలంలో వేసిన బ్లూషీట్లను తొలగించి ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.