Road accident | మానకొండూర్ రూరల్, ఆగష్టు 21: విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మానకొండూర్ మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ కోసం స్పెషల్ బస్సు ఏర్పాటు చేశారు.
రోజు వారిగా విద్యార్థులు ఒక్కసారిగా బస్సు ఎక్కేందుకు డోర్ దగ్గరికి వచ్చారు. ఈ బస్సు రేకు కోసుకు పోవడంతో చెంజర్ల గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న గాజుల అభిషేక్‌కు కాలుకు తీవ్ర గాయాలు కాగా, చెంజర్ల గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న యస్వక్ చేతన క్కు స్వల్ప గాయాలు అయ్యాయి.
స్థానికులు, పాఠశాల ఉపాధ్యాయులు క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఒక్కసారిగా విద్యార్థులు రావడంతోనే ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.