Basara IIIT | ధర్మారం, జూలై 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజనీ సిద్ధార్థ్, తమ్మనవేన రమ్యశ్రీ పదవ తరగతి చదివారు. వీరిలో టెన్త్ ఫలితాలలో అంజనీ సిద్దార్థ్ అనే విద్యార్థి 566 మార్కులు సాధించగా రమ్య శ్రీ అనే విద్యార్థిని 563 అత్యుత్తమ మార్కులు సాధించారు.
ఈ ఇద్దరు విద్యార్థులు నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈరవేని రాజ్ కుమార్ తెలిపారు. ట్రిపుల్ ఐటీ కళాశాలకు విద్యార్థులను ప్రిన్సిపల్ శనివారం పాఠశాల ఆవరణలో శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు సీట్లు సాధించే విధంగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.