కాజీపేట, ఫిబ్రవరి 21: హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ శివారులోని అయోధ్యపురంలో ఏర్పాటు చేస్తున్న రైల్వే మల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో శనివారం రైల్వే, ఆర్వీఎన్ఎల్ అధికారులు డీజిల్ రైలింజన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశానుసారం రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), రైల్వే అధికారులు కాజీపేట రైల్వే యార్డు నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన రైలు పట్టాల మీదుగా ఆర్ఎంయూ షెడ్ వరకు ప్రత్యేకంగా అలంకరించిన రైలింజన్, ప్రత్యేక బోగీతో నడిపించారు. కార్యక్రమంలో ఆర్వీఎన్ఎల్ సీపీఎం సాయిప్రసాద్, డీజీఎం మురళీకృష్ణ, జీఎంలు పాల్గొన్నారు.