కార్పొరేషన్ మార్చి 24 : కరీంనగర్ నగర పాలక సంస్థలో ఆస్తి పన్నులు చెల్లించని రెండు భవనాలను నగరపాలక అధికారులు సోమవారం సీజ్ చేశారు. నగరంలోని వెంకట సాయి థియేటర్ గత మూడేళ్ల నుంచి పన్ను చెల్లించకపోగా ఇప్పుడు వారి బకాయి రూ.8 లక్షలకు పైగా అయ్యిందని అధికారులు తెలిపారు. అలాగే లిటిల్ పార్క్ నుంచి కూడా పది లక్షల రూపాయల రావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ నుంచి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తామని అధికారులు వివరాలను వెల్లడించారు. అయినా ఆయా ఇంటి యజమానియాలో స్పందించకపోవడంతో సోమవారం ఆ ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి పాటుపడాలని అధికారులు కోరారు.