TUWJ (IJU) | పెద్దపెల్లి టౌన్ జూన్ 15 : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పెద్దపెల్లి జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. జూన్ 14న ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా అదే రోజు రాత్రి సభ్యుల అంగీకారంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికను ఆదివారం ఆర్ఆర్ గార్డెన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడిగా మల్లవర్జుల దయానంద్ వంశీ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నారదాసు అశోక్, ఉపాధ్యక్షులుగా సాదుల సుగుణాకర్, అరెల్లి మల్లేష్, కుమార్ రాజు చంద్రమోహన్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, బాలే శివప్రసాద్, సహాయ కార్యదర్శులుగా గడ్డం రవీందర్, ముత్యాల నరసయ్య, జబ్బర్ ఖాన్, జ్యోతుల ప్రవీణ్, బహిరం సతీష్, ఎండీ గౌస్ పాషా, కోశాధికారిగా తగరం రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా ఆకుల రమేష్, మామిడి సత్యనారాయణ, చంద్రమౌళి, ఏలువాక కుమార్, మల్యాల రమేష్, గౌడ్, పరస శ్రీనివాస్, మంతెన రమేష్, తాళ్ల రమేష్, లక్కాకుల నాగరాజు, కిరణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎనగందుల రవీందర్, సహాయ ఎన్నికల అధికారి గుండ్ల శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. దాడుల వ్యతిరేక కమిటీ జిల్లా కన్వీనర్ గా చింతకింది చంద్రమౌళిని ఏకగ్రీవంగా సభ ఆమోదించినట్లు ప్రకటించారు.
నూతనంగా ఎన్నికైన యూనియన్ సభ్యులకు ఎమ్మెల్యే విజయ రమణారావు, రాష్ట్ర నాయకులు విరాహత్ హలీ, నగునూరు శేఖర్, రామ్ నారాయణ అభినందనలు తెలిపారు.