గోదావరిఖని, జనవరి 20 : కేసీఆర్ సర్కారు తెచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులపై చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు.
దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపిందని, అలాంటి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. సమావేశానికి ముందు ఎమ్మార్పీస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా యాసర్ల రాజ్‌కుమార్(తిమోతి)ను శ్రీనివాస్ ఎంపిక చేశారు. సమావేశంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి దుర్గాప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, ఎంఎస్ఎఫ్ నియోకవర్గ ఇన్చార్జి ఈర్ల ప్రేమ్‌కుమార్, నాయకులు మేడ ప్రవీణ్, మాచర్ల శ్రీనివాస్, కుమ్మరి నవీన్, దయాకర్, సుందిల్ల రేణుక ఉన్నారు.