Accident | యైటింక్లెయిన్ కాలనీ, జూన్ 14 : ఓ చిన్నారిని తప్పించబోయి సింగరేణి సంస్థ అధికారి ఒకరు మృత్యు ఒడిలోకి వెళ్లిన హృదయ విధారకర సంఘటన స్థానికులను కలిచివేసింది. పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లెయిన్ కాలనీ లో సింగరేణి క్వాటర్ల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి రామగుండం -2 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ -3 రిలే బి అండర్ మేనేజర్ రమేష్ బాబు మృత్యువాత పడ్డాడు.
తన ద్విచక్ర వాహనంపై క్వార్టర్ల మధ్యలో నుంచి వెళ్తుండగా ఓ చిన్నారి అడ్డు రావడంతో తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొనడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా సంఘటన స్థలంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఎవరూ కూడా దగ్గరికి రావడానికి సాహసం చేయలేదు. మానవత్వం మరిచి అందరూ చూస్తుండగానే సదరు అధికారి ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.