ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే నీచరాజకీయాలకు దిగుతున్నాడని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల సమయంలో అర్వింద్ రాసిన బాండ్ పేపర్ ఓ నాటకమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మండిపడగా, ఎమ్మెల్సీ కవితపై అవాకులు చవాకులు పేలుతున్న అర్వింద్ ఓ సంస్కారహీనుడని, ఆయనో యాక్సిడెంటల్ ఎంపీ అంటూ జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత విరుచుకుపడ్డారు.
జగిత్యాల అర్బన్/ ఇల్లంతకుంట, నవంబర్ 18 : ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల, ఇల్లంతకుంటలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్రలు నిర్వహించి, దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే నీచరాజకీయాలకు దిగుతున్నాడని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో అర్వింద్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి, దహనం చేశారు. ఇక్కడ నాయకులు డాక్టర్ భోగ ప్రవీణ్, యువజన అధ్యక్షుడు కత్రోజు గిరి, కౌన్సిలర్లు కోరె గంగమల్లు, అల్లె సాగర్, బొడ్ల జగదీష్, పంబాల రాము, నాయకులు ప్రశాంత్.రావు, ఒద్ది రాంమోహన్, జగన్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అర్వింద్ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశా రు. ఇక్కడ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్, మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సాదుల్ మాట్లాడుతూ తెలంగాణ సం స్కృతి సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియ జేస్తూ ఆచరింపజేయడానికి కృషి చేస్తున్న కవితపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్య లు చే యడం బాధాకరమన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వారిని గ్రామాల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నా యకులు ప్రశాంత్, ప్రశాంత్‌రెడ్డి, పసుల బాబు, ఉస్మాన్, కూనబోయిన రఘు, జనార్దన్, సావనపెల్లి రాకేశ్, బాలరాజు, సమీర్, రహీం, హరీశ్, ఇమ్రాన్, మహేశ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.