మోదీ తెలంగాణకు చేసిందేం లేదు
ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్ రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దితే, మోదీ మాత్రం వరంగల్‌లో గాలిమాటలు మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
- అవినీతి పాలనలో ఆయనే నంబర్ వన్
- తొమ్మిదేండ్ల పాలనలో దేశం వెనుకబడ్డది
- రాష్ట్ర పన్నులను గుజరాత్ అభివృద్ధికి మళ్లిస్తుండు
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజం
కొడిమ్యాల, జూలై 8 : ప్రధాని నరేంద్ర మోదీ తె లంగాణ అభివృద్ధి కోసం చేసిందేం లేదని, దేశం తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో చాలా వెనకబడిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం కడుతున్న పన్నులతో గజరాత్ రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దితే, మోదీ మాత్రం వరంగల్‌లో గాలిమాటలు మా ట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వృద్ధులకు 2 వేల పింఛన్, కల్యాణలక్ష్మి, రైతు బీమా. రైతు బంధు పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలన్నారు. మన గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇటీవలే తెలంగాణ పల్లెలకు దేశ స్థాయి లో 17 ఆవార్డులు వచ్చాయని చెప్పారు.
గతంలో వ రంగల్‌కు ఇందిరా గాంధీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రకటిస్తే బీజేపీ ప్రభుత్వం గుజరాత్‌కు తరలించిందని చెప్పారు. అవినీతి పాలనలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానం లో మోదీ ఉన్నారని విమర్శించారు. రాష్ర్టానికి మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోదీ మాట తప్పారని విమర్శించారు. నల్లధనం అం తా అంబానీ, అదానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పులి వేంకటేశం గౌడ్, రైతు బంధు మండల కన్వీనర్ అంకం రాజేశం, సింగి ల్ విండో చైర్మన్ పొలు రాజేందర్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

