
బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితబంధు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారంటూ టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి ఓర్వలేని ఈటల రాజేందర్ దళిత బంధు పథకం ఆపివేయాలని లేఖ రాయడం సిగ్గుచేటు అని అన్నారు. రాబోయే రోజుల్లో దళిత కాలనీలో ఈటల రాజేందర్ తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈటల రాజేందర్ దళితులను 20 ఏండ్లు వాడుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం పెడితే దళితులపై అక్కసు వెల్లగక్కుతున్నారని ఆరోపించారు.
సమావేశంలో టీఆర్ఎస్ మండల నాయకులు నవీన్ కుమార్ పింగిలి ప్రతాప్ రెడ్డి, పుల్ల శ్రీనివాస్, సంపత్ రావు, కృష్ణ ప్రసాద్, సత్యనారాయణ రావు, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
