Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల నాయకులు గుండ్లపల్లి స్టేజి వద్ద న్యాయవాది ప్రభాకర్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రాంతానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు బార్ ఆసోసియేషన్లో ఘనవిజయం సాధించడం గర్వకారణమన్నారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, ములకల మల్లేశం, రామ్ నరేష్, అజంధర్, రమేష్, మల్లేశం, రాజయ్య, పలుపార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.