Tribal leaders | రుద్రంగి, సెప్టెంబర్ 25: రుద్రంగి మండలం సర్పంచిండా గ్రామానికి చెందిన మాలోత్ ఠాకూర్ సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సాధించడంతో ఉమ్మడి మానాల గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకుమాలోత్ ఠాకూర్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన కుటుంబంలో పుట్టి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ లో సీటు సాధించడం అభినందనీయమన్నారు.
రానున్న రోజుల్లో కష్టపడి చదివి ఉమ్మడి మానాల గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరహరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, భూమానాయక్, అంబర్‌సింగ్, రఘుపతి, గంగ్య, శర్మన్, గజన్, చందర్, సంతోష్, దేవేందర్, మదన్లతో పాటు గిరిజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.