కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లా రెవెన్యూ శాఖలో కొద్దిరోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తహసీల్దార్ల బదిలీలకు ( Tahsildars Transfers ) ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి గ్రీన్ సిగ్నల్ లభించింది. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ( Collector Orders ) విడుదల చేశారు. కొత్తపల్లి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఎన్ రాజేష్ కరీంనగర్ అర్బన్‌కు, కే విజయ్ కుమార్‌ను తిమ్మాపూర్ నుంచి మానకొండూర్‌కు, ఇక్కడ పనిచేస్తున్న బి రాజేశ్వరి రామడుగుకు బదిలీ అయ్యారు.
సీహెచ్ రాజు కరీంనగర్ రూరల్ నుంచి జమ్మికుంటకు, అక్కడ పనిచేస్తున్న జి రమేష్ బాబు శంకరపట్నంకు, బి భాస్కర్ శంకరపట్నం నుంచి హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయానికి, ఇక్కడ పనిచేస్తున్న కే. శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్‌కు బదిలీ చేశారు.
జె. నరేందర్ కరీంనగర్ అర్బన్ నుంచి గన్నేరువరం, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈ నరేందర్ కరీంనగర్ అర్బన్‌కు , జి మంజుల సైదాపూర్ నుంచి వీణవంకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం కాళీచరణ్ జి సెక్షన్ సూపరింటెండెంట్‌గా , అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్. శివాని సి సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు.
,