SERP | చిగురుమామిడి, ఆగస్టు 31 : డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లు నలుగురికి స్థాన చలనం కలిగింది.
గంప సంపత్ కుమార్ కరీంనగర్ డీఆర్డీవో కార్యాలయానికి, వెంకటమలు తిమ్మాపూర్ మండలానికి బదిలీపై వెళ్లారు. సత్యనారాయణ, వెంకటేశ్వర్లు మండలంలోని మరో క్లస్టర్ లకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఇద్దరు స్థానంలో హుస్నాబాద్ నుండి రవీందర్, కోహెడ మండలం నుండి పర్కాల రమేష్ బదిలీపై వచ్చారు. వీరు సోమవారం మండల కేంద్రంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎంకు నియామక పత్రాలను అందజేసి జాయిన్ కానున్నారు.