Sand reach | ఎల్లారెడ్డిపేట, మే, 8: వెంకటాపూర్, నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు. ఎస్ఐ రమకాంత్, ప్రొబేషనరీ ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నావారిని బలవంతంగా రోడ్డు పై నుంచి చెదరగొట్టారు. అనంతరం కొందరు ప్రతినిధులతో పాటు పలు పార్టీల నాయకులు తహసీల్దార్ సుజాతతో రీచ్ సమస్యపై మాట్లాడారు.
ఒకే రీచ్ కు అనుమతి ఇవ్వడం వల్ల ట్రిప్పుకు రూ.3వేల నుంచి రూ.4 వేలు వసూలు చేస్తున్నారని దీన్ని దృష్టి లో ఉంచుకుని అన్ని రీచ్ లకు అనుమతి ఇవ్వాలని పలు పార్టీల, గ్రామాల ప్రతినిధులు తహసీల్దార్ ను కోరారు. ఇసుక రీచ్ సమస్య పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లుతానని తహసీల్దార్ సుజాత వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ కే గౌస్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.