Singareni Ladies Club | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో కనుల పండుగగా బొమ్మల కొలువు నిర్వహించారు. ఆర్జీ-1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు జీఎం సతీమణి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ‘బొమ్మల కొలువు’ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ సతీమణి ఎల్వీ మాలతి సూర్యనారాయణ, సంస్థ డైరెక్టర్ (ఈఅండ్ఎం) తిరుమల్ రావు, సంస్థ డైరెక్టర్స్ కే విజయ లక్ష్మి వెంకటేశ్వర్లు, పద్మ తిరుమల రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డైరెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి భారీ ఎత్తున ఊరేగింపు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బొమ్మల కొలువులో మన సంస్కృతి సంప్రదాయం ఉట్టి పడేలా ఉన్నాయని, ఇందులో ప్రత్యేకంగా 7 వైకుంఠ ద్వారాలు చేదా బావి, పొలం, భోగి పండ్లు పోసే కార్యక్రమం, సమ్మక్క సారలమ్మ, చిలకలగుట్ట, నవగ్రహవనాలు, రాశి వనాలు, ఏడు విష్ణుద్వారాలు తో గరుడ ప్రవేశం, అమ్మోరు, శివుడు, రైసింగ్ తెలంగాణ, శాంతి బౌద్ధ విగ్రహం, ప్రాచీన వస్తువులు అన్ని ప్రదర్శించారు. ఈ విధంగా పల్లెటూరి వాతావరణన్ని సృష్టించి పూర్వపు చరిత్రని ప్రస్తుత వారికి తెలిపేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేసిన కుటిరం, మంచే, సంక్రాతి సంబురాలలో ఏర్పాటు చేసే, చుట్టు పక్కల పల్లెటూరి వాతావరణం, చేదబావి, సమ్మక్క-సారక్క సంస్కృతి అనే వివిధ రకాల బొమ్మలతో పలు అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ సాంస్కృతీ సాంప్రదాయాల పురాతన పనిముట్లు, ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి.
ధనుర్మాసం సందర్భంగా దశవతారాలు వేషాధారణ తత్త్వంతో ఉట్టి పడే విధంగా వివిధ అలంక్రుత ‘బొమ్మల కొలువు’ నిర్వహించారు. ఈ బొమ్మల కొలువు వల్ల అందరికీ శుభం జరుగుతుందని తెలిపారు. మొదట వచ్చిన అతిథులు గణపతి పూజ చేసి ప్రారంభించి పాలు పొంగించి వేడుకలు నిర్వహించారు. అలాగే బొమ్మల కొలువులో గణపతి దేవునికి మంగళ హారతులు ఇచ్చి అందరి మీద కరుణ కటాక్షలు ఉండాలని కోరారు. ప్రతీ ఏటా నిర్వహించే ‘బొమ్మల కొలువు’ ఎంతో రమ్యంగా ఉంటుందని, ఇక్కడి వాతావరణం చూడ చక్కని దృశ్యాలతో ఆకట్టు కునేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ సభ్యులు చేసిన ఆధ్యాత్మికతతో దశావతారాల థీమ్ బొమ్మల కొలువు అంగరంగ వైభవంగా సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆర్జీ-1,2,3 జీఎంలు డీ లలిత్ కుమార్, మధుసూదన్, ఆర్జీ రిజీయన్ క్వాలిటీ జీఎం సుజోయ్ మజుందర్, రెస్క్యు జీఎం శ్రీనివాస రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంబర్కిషోర్ఝా సతీమణి త్రిప్తి అంబర్ కిషోర్ ఝా, ఆర్జీ-1,2,3 ఏఎల్పీ, ఇతర ఏరియాల జీఎంల సతీమణులు జీ వనజ వెంకటయ్య, ఎస్ తిరుమల, సుప్రియ సుజోయ్ మజుందర్, కే వాణి శ్రీనివాస రెడ్డి, ఎన్ అలివేణి సుధాకర రావు, ఉమ శ్రీనివాస్, వెంకటలక్ష్మి నాగేశ్వరరావు, సునీత రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మీ రఘు కుమార్, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్ శాఖ అధికారులు, అధికారులు, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష చంద్రశేఖర్, లేడీస్ క్లబ్ కమిటీ, సభ్యులతో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.