Tobacco | ఫర్టిలైజర్ సిటీ, మే 31: పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదకర మని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉద్దేశించి కోర్ట్ సిబ్బంది కి నిర్వహించిన న్యాయ విజ్ఞాన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తం గా సాలీనా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు.ప్రతిఒక్కరు పొగాకు దుష్పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.ఇక్కడ. 2 వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ వెంకటేష్, అదనపు జిల్లా న్యాయ స్థాన పరిపాలన అధికారి శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్లు శ్రీధర్, విజయ సారథి, రూత్ తదితరులు పాల్గొన్నారు.