Chigurumadi | చిగురుమామిడి, మే 4: మండలంలో అకాల వర్షం, ఉరుములు మెరుపులతో రైతులకు తీవ్ర నష్టం వాటిలింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన కుప్పలు తడిసాయి. పలు గ్రామాల్లోని మామిడి తోటల కాయలు నేలరాలాయి. ముల్కనూరులో ఈదురుగాలులకు చెట్టు విరిగి ప్రధాన రహదారిపై కరెంటు పోలు విరిగి పడింది. వాహనదారులకు అంతరాయం ఏర్పడింది.ఇందుర్తిలో గాలివానకు అందే రాములు ఇల్లు నేల కూలింది.
పలు గ్రామాల్లో ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. ఈదురుగాలులకు అన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. మండలంలో పంట నష్టంపై పూర్తి సమాచారం రాలేదని ఏవో రాజులనాయుడు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు వర్షానికి తడి సాయన్నారు.