హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవిస్తుంటుంది. అయితే, వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉంటే పిడుగు పాటు నుంచి రక్షించుకునే అవకాశం ఉంది.