Thippiri Tirupati | కోరుట్లలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ
నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షకు హాజరయ్యారు.
- న్యాయవాదిగా పేదలకు సేవ చేయాలన్నదే నా అభిమతం
Thippiri Tirupati | కోరుట్ల, మే 13 : నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షకు హాజరయ్యారు. విప్లవ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన తిరుపతి 1983-85 విద్యా సంవత్సరంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయన విప్లవ భావజాలానికి ఆకర్షితులై రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్‌గా పనిచేశారు. అదే కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పేపర్ ను ఆయన బైకాట్ చేశారు.
మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ తెలుగు సెకండియర్ పరీక్ష మాత్రం మిగిలిపోయింది. ఇటీవల మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జన జీవనంలోకి అడుగిడిన దేవ్ జీ, అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తి చేయాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని మాస్ట్రో జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. సుమారు 45 ఏళ్ల తర్వాత పరీక్షా హాలులో అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా పరీక్షకు ముందు మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చినట్లు తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ పరీక్ష విధానంలో మార్పులు వచ్చిన ఇప్పుడు కూడా తాను విద్యార్థిగా మళ్లీ పరీక్ష రాసేందుకు రావడం కొత్త అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత న్యాయ విద్య అభ్యసించి పేదలకు న్యాయ సహాయం అందిస్తానని దేవ్ జీ వెల్లడించారు. కాగా పరీక్ష రాసేందుకు వచ్చినా తిరుపతిని పరీక్ష హాల్ గేటు వద్ద అధ్యాపకులు తనిఖీ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

