Karimnagar | అక్కడ ఆచరణ.. ఇక్కడ నిరీక్షణ.. ఏపీలో పాత పెన్షన్‌కు పచ్చజెండా.. తెలంగాణలో మెలికలు
ఒకే దేశం.. ఒకే ఉద్యోగ వ్యవస్థ.. ఒకే నియామక ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులు.. కానీ పెన్షన్ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల పరిస్థితులు నెలకొన్నాయి. అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తే.. తెలంగాణలో మాత్రం అదే అంశంపై ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
- సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీతో ఉద్యోగుల్లో ఆందోళన
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 10 : ఒకే దేశం.. ఒకే ఉద్యోగ వ్యవస్థ.. ఒకే నియామక ప్రక్రియలో భాగస్వాములైన ఉద్యోగులు.. కానీ పెన్షన్ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల పరిస్థితులు నెలకొన్నాయి. అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తే.. తెలంగాణలో మాత్రం అదే అంశంపై ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఉద్యోగుల జీవితకాల భద్రతకు సంబంధించిన పెన్షన్ విషయంలో ప్రభుత్వాల మధ్య ఇంతటి వ్యత్యాసం ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు ఉద్యోగ నియామక ప్రకటన వెలువడి, ఆ తర్వాత నియామకాలు పొంది సీపీఎస్ పరిధిలోకి వచ్చిన అర్హులైన ఉద్యోగులకు ఓపీఎస్ ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఓ ఎంఎస్ నంబర్ 53 (13-07-2026) ద్వారా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాజాగా జీఓ ఎంఎస్ నంబర్ 158 (09-11-2026) ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారితోపాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అర్హులైన కుటుంబ పెన్షన్ లబ్ధిదారులకు సైతం డిసెంబర్ 31, 2026 వరకు వన్‌టైమ్ ఆప్షన్ కల్పించి, ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. కానీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17, 2023 మార్చి 3 తేదీల్లో జారీ చేసిన మార్గదర్శకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం ప్రదర్శిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని 2025 జూలైలో తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అంతకుముందు మార్చి 19, 2025న కూడా కొన్ని ఉద్యోగుల విషయంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ వాటి అమలుపై స్పష్టత లేకపోవడంతో బాధిత ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, అర్హులైన ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయడం ఉద్యోగ వర్గాల్లో మరింత ఆందోళనకు కారణమైందని, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఒకే డీఎస్సీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియామకమైన ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓపీఎస్ అవకాశం కల్పిస్తుంటే తెలంగాణలో మాత్రం అదే అర్హత కలిగిన ఉద్యోగులు న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తమవుతున్నది. ఉద్యోగుల పెన్షన్ అనేది ప్రభుత్వం పెట్టే భారం కాదు దశాబ్దాల పాటు సేవలందించిన ఉద్యోగులకు కల్పించాల్సిన సామాజిక భద్రత. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సంక్షేమం గురించి హామీలు గుప్పించే పాలకులు అధికారంలోకి వచ్చాక వారి న్యాయమైన సమస్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని, కేంద్ర మార్గదర్శకాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ అర్హులైన డీఎస్సీ-2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతున్నది. ఎస్ఎల్పీ విషయంలోనూ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని, ఉద్యోగుల జీవిత భద్రతను న్యాయపోరాటాలకు వదిలేయకుండా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

