Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Tamil Nadu | తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu State) హోసూర్ (Hossur) సమీపంలో ఉన్న ఐఫోన్ విడి భాగాల తయారీ ప్లాంట్ (iPhone factory) లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ఊపిరాడక మరణించారు. విషపూరిత వాయువులు పీల్చి ఊపిరాడకపోవడమే వారి మరణాలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.
Tamil Nadu : తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu State) హోసూర్ (Hossur) సమీపంలో ఉన్న ఐఫోన్ విడి భాగాల తయారీ ప్లాంట్ (iPhone factory) లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ఊపిరాడక మరణించారు. విషపూరిత వాయువులు పీల్చి ఊపిరాడకపోవడమే వారి మరణాలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. మెయింటనెన్స్ విభాగంలో పనిచేస్తున్న వీరు సోమవారం వ్యర్థజలాల (Waste Water) శుద్ధీకరణ ట్యాంక్ వద్ద ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తొలుత ఓ కార్మికుడు ట్యాంకు లోపలికి తొంగిచూసే క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలాడు. అతడికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్లిన క్రమంలో మరో ఇద్దరు కార్మికులు స్పృహ కోల్పోయారు. తోటి సిబ్బంది వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లాంట్‌ను టాటా ఎలక్ట్రానిక్స్ నిర్వహిస్తున్నది. తాజా ఘటనపై ఈ కంపెనీ నుంచి గానీ, యాపిల్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే ఈ ఘటనపై కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే మరణాలకుగల అసలు కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | ఐఫోన్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికులు దుర్మరణం
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

