‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూపురేఖలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం రాజకీయ అసహనానికి నిదర్శనమని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన...
– కేటీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ అసహనానికి నిదర్శనం
– వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్
– రైతు భరోసా, రుణమాఫీ ఏమయ్యాయి
– బీఆర్ఎస్ వైరా నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, నవంబర్ 10 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూపురేఖలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం రాజకీయ అసహనానికి నిదర్శనమని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి.. అందుకు భిన్నంగా వ్యక్తిగత దూషణలకు దిగడం ఆయన బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలే తప్ప, ఇలాంటి వ్యక్తిగత దాడులకు తావులేదన్నారు. కేటీఆర్‌ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి ఇలాంటి దివాలాకోరు రాజకీయాలకు తెరతీశాడని విమర్శించారు.
హామీల అమలు ఏదీ?
ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గిరిబాబు దుయ్యబట్టారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకు కొలువులు, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పాలనాపరమైన తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న వ్యక్తి నుండి ప్రజలు ఆశించేది చౌకబారు విమర్శలు కాదని, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీల అమలు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలు కట్టిపెట్టి, రాష్ట్ర ప్రగతిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

