Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
నగల దుకాణంకు దుండగలు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు.
మేడ్చల్ : నగల దుకాణంకు దుండగలు కన్నం వేశారు. ఆ కన్నంలో నుంచి లోపలికి ప్రవేశించి, బంగారం, వెండి నగలతో పాటు నగదు అపహరించారు. 24 గంటలు ప్రజలు సంచరించే జాతీయ రహదారి పక్కన, పోలీస్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న దుకాణంలో దుండగలు చోరీకి పాల్పడటం మేడ్చల్‌లో కలం కలం సృష్టించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ పోలీస్టేషన్ పక్కన ఉన్న దుకాణంలో శేషుమాల్ చౌదరి శ్రీ జగదాంబ జువెల్లర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆయన దీపావళి పూజలు నిర్వహించి, దుకాణం మూసి వెళ్లిపోయాడు. సోమవారం దుకాణంను తెరవలేదు.
మంగళవారం ఉదయం చౌదరి దుకాణం తీసి చూడగా దుకాణం లోపల ఉన్న చెక్క తలుపు విరిగి ఉంది. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా వెనుక ఉన్న గోడకు పెద్ద కన్నం వేసి ఉంది. దుండగలు వెనుక వైపు నుంచి దుకాణంకు కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత అడ్డుగా ఉన్న చెక్క తలుపు సగం వరకు తొలగించి, నగలు విక్రయించే గదిలోకి వచ్చారు.
అక్కడి నుంచి బంగారు, వెండి నగలు, డ్రాలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దుండగలు 25 తులాల బంగారం, 3.5 కిలో వెండి, రూ. 4 లక్షల నగదును ఎత్తికెళ్లినట్టు నిర్వాహకుడు శేషుమాల్ చౌదరి తెలిపారు. నగదు కాకకుండా చోరీకి గురైన సొత్తు విలువ రూ.60 లక్షలు ఉంటుందన్నారు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో దొంగలను పట్టుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Med
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jewelry store | నగల దుకాణంకు కన్నం.. రూ.80 లక్షల బంగారం, వెండి చోరీ
Yash | రావణుడి గెటప్‌లో పిల్లలతో యశ్ దీపావళి వేడుకలు.. ఫొటోలు!
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

