Putta Madhukar | మంథని, జూన్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్‌గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నది..కాంగ్రెస్ బెదిరింపులకు, కుట్రలకు భయపడేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. ఫార్మెలా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరవుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మద్ధతు తెలిపేందుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నేతృత్వంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలి వెళ్లారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తో కలిసి పుట్ట మధూకర్, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. నూతనంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు, నోటిసుల పేరుతో బీఆర్ఎస్ నాయకులకు లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. అధికారాన్ని అనుభవిస్తూ.. డబ్బు సంపాదనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తప్పా అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై నోటిసులు, విచారణల పరుతో ఇబ్బందులు గురి చేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చెప్తారన్నారు. మళ్లీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.