CMRF | పెగడపల్లి: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు రాములుగౌడ్ 93 మంది లబ్ధిదారులకు రూ.28లక్షల22వేల 500 విలువగల CMRF చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ ని గతంలో రూ.ఐదు లక్షలు ఉంటే దానిని రూ.పది లక్షలు పెంచిందని చెప్పారు. అంతేకాకుండా ఇంకా మెరుగైన వైద్య సేవల కోసం అదనపు ఖర్చులు భరించలేనిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసున్న ప్రతీ ఒక్కరికి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. పేదవారికి ఆర్థిక భరోసా కల్పించి ప్రతీ ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్, ఉపాధ్యక్షులు సంధి మల్లారెడ్డి, తడగొండ రాజు, బండారి శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి, AMC డైరెక్టర్ చాట్ల భాస్కర్, సీనియర్ నాయకులు, పూసాల తిరుపతి, కడారి తిరుపతి, సింగసాని స్వామి, ఎల్లగొండ కృష్ణ హరి,అమెరిశెట్టి లక్ష్మీనారాయణ, AMC డైరెక్టర్లు చేట్ల కిషన్, ఆడుప తిరుపతి, తౌటు గంగాధర్, దేశెట్టి లక్ష్మి రాజం, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కొండం మధుసుదన్, జిల్లా యూత్ నాయకులు బొమ్మగోని జితేందర్ గౌడ్, బొడ్డు రమేష్, ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, గర్వాంద రమేష్ గౌడ్, కుంచె రాజేందర్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.