కమాన్చౌరస్తా, మే 13 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ (న్యాయ కళాశాల)కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఎస్యూ ఉపకులపతి ఆచార్య యు ఉమేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
కొత్త కోర్సుల మౌలిక ఏర్పాటులో విశ్వవిద్యాలయం ముందుకు సాగుతుందన్నారు. దీనికి తోడ్పాటు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేంద్ర చట్ట, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.