Independence Day | పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్/పెద్దపల్లి రూరల్/పెద్దపల్లి కమాన్, ఆగస్టు 15 : పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్ని గురుకుల విద్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపాల్స్ జాతీయ పతాకావిష్కరణ గావించి, జెండా వందనం చేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు సామాజిక అంశాలపై చైతన్యపరిచేలా నాటిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్రోద్యమంలో మహానీయులు చేసిన సేవలను కొనియాడారు.
జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, డీసీపీ కార్యాలయంలో డీసీపీ పీ కరుణాకర్, సబ్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి బీ శ్రీనివాసులు, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గజ్జి కృష్ణ, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో రంగారావు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో బొద్దుల గంగయ్య, ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ నాగేశ్వర్రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌కుమార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ అశోక్, ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, ట్రినిటీ విద్యాసంస్థల్లో వ్యవస్థాపకులు దాసరి మనోహర్‌రెడ్డి, సీబీఎస్ఈ స్కూల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, గాయత్రి విద్యానికేతన్‌లో చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
కాగా, 40 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో సేవలందించిన సీనియర్ న్యాయవాదులను జిల్లా జడ్జి సునీత కుంచాల, బార్ అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, పెద్దపల్లి, అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయాల్లో చైర్మన్లు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, చింతపండు సంపత్‌లు జెండా ఆవిష్కరించారు.
సీఐలు ప్రవీణ్‌కుమార్, సుబ్బారెడ్డి, నాయిబ్ తహసీల్దార్లు విజేందర్, రవీందర్, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, వ్యాపారవేత్తలు జకోటియా, తివారి, ఏఎస్ఐ గౌస్‌మియా, ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్, ఏవో కాంతాల అలివేణి, ఏపీఎం శైలజా శాంతి, ఏపీవో రమేశ్‌బాబు, సీఈవోలు మెట్టు మధన్మోహన్, గడ్డి తిరుపతి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీఎస్పీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఇరికిళ్ల రాజనర్సయ్య జెండా ఆవిష్కరించారు.