Sarangapur | ప్రకృతి వ్యవసాయంతోనే నేల ఆరోగ్యవంతంగా ఉంటుంది.. సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్
ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లయితేనే నేల ఆరోగ్యం బాగుపడుతుందని రైతుల ఆరోగ్యాలు మెరుగుపడతాయని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ అన్నారు.
Sarangapur | సారంగాపూర్, ఆగస్టు 25 : ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు వ్యవసాయం చేసినట్లయితేనే నేల ఆరోగ్యం బాగుపడుతుందని రైతుల ఆరోగ్యాలు మెరుగుపడతాయని సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ అన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో మండల వ్యవసాయ అధికారి తిరుపతి ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ సౌజన్యంతో రైతులకు ప్రకృతి వ్యవసాయం, పంటల సమగ్ర సస్యరక్షణపై మంగళవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలని అధిక మోతాదులో ఎరువులు వాడి నేల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని రైతులకు సూచించారు.
పలు పంటలలో పరుగుల యొక్క సాంద్రతను తెల్సుకున్న తర్వాతనే జీవ నియంత్రణ పద్ధతులు చేపట్టి తద్వారా పరుగుల, తెగుళ్ల యొక్క ఉధృతిని అరికట్టాలని, దానికి వేప నూనే ట్రైకోడేర్ మై విరిడి సూడోమోనోస్ లాంటి పరుగుల, తెగుళ్ల యొక్క ఉధృతిని తగ్గించుకోవాలని సూచించారు. పలు పథకాలను ఎఫ్ఎఫ్ఎస్ బుకింగ్ యాప్ పైన తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నీల తిరుపతి, టెక్నికల్ ఏవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఎలమట్ల హరీష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు హర్షకోట రాజగోపాల్ రావు, ఆదర్శ రైతు రాములు, కృష్ణరావు, శిరీష, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

