Peddapally | పెద్దపల్లి, జనవరి3: పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని శనివారం పోగమంచు కమ్మెసింది. ఎటు చూసిన పోగ మంచు కనువిందు చేసింది. కాశ్మీర్ అందాలను తలపించిందని, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశామని ప్రకృతి ప్రేమికులు, మార్నింగ్ వాకర్స్ తెలిపారు.
శనివారం తెల్లవారుజాము నుంచి 11 గంటల దాకా పోగ మంచు ఆహ్లాదాన్ని పంచింది. రోడ్డు కన్పించకపోటంలో వాహనాలుదారులు హెడ్లైట్స్ వేసుకోని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోగమంచు పడినట్లు మార్నింగ్ వాకర్స్ పేర్కొన్నారు.