Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్ నవంబర్ 17 : సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేవని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులకు తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులను సన్మానించి పెన్నులు, పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జర్నలిస్టులు స్వతంత్ర దినోత్సవ కాలం నుంచి కష్టపడి ప్రతిపక్ష హోదాగా జర్నలిస్టు వ్యవహరిస్తున్నారని, మారిన పరిస్థితిల దృష్ట్యా జర్నలిస్టులపై బాధ్యత పెరిగిందన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గర్రెపల్లి శంకర్ సీనియర్ జర్నలిస్టులు రావి కోటేశ్వర్, సిద్ధం సదానందం, వీరగోని రమేష్, ఆర్ఐలు వజహత్ ఆలి, నిహారిక సీనియర్ అసిస్టెంట్ అజీమ్, రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.