Godavarikhani | కోల్ సిటీ, జూలై 6 : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అన్నారు. జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం జరిగిన వర్ధంతి వేడుకలకు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జిల్లా కార్యదర్శి ఇరుగురాల కృష్ణయ్య, జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్లతో కలిసి జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకవెళ్లడంలో జగ్జీవన్ రామ్ కృషి ఎనలేనిదన్నారు.
చిన్నతనంలోనే కేంద్ర మంత్రిగా దేశంలోనే 40 సంవత్సరాలు ఎంపీగా కొనసాగిన గొప్ప నాయకుడని అన్నారు. దళితుడన్న కారణంతోనే ప్రధాన మంత్రి కాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. సంఘం జిల్లా కో-కన్వీనర్ గజ్జల శశిభూషణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు బొచ్చు శంకర్, ఎంఏ కరీం, కనకం గణేష్, బూడిద సమ్మయ్య, ఆకునూరి రాజయ్య, మడిపల్లి శ్రీనివాస్, పుల్లూరి మహేందర్, ఇందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.